రంగస్థలం సినిమాలోని పోస్టర్
టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే చర్చ. అది రంగస్థలం సినిమాపైనే. విలక్షణ దర్శకుడు సుకుమార్ సినిమాను తెరకెక్కిస్తుండమే ప్రధాన కారణం. పైగా అందులో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ విభిన్నపాత్రలో నటించడం ఇంకాస్త ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పటికే విడుదలైన రంగస్థలం పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నాయి.
ఇంతవరకు హీరో హీరోయిన్లకు సంబంధించిన లుక్స్, పోస్టర్స్ మాత్రమే బయటకు విడుదల చేసింది చిత్రబృందం. కానీ తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టి పాత్రకు సంబంధించిన పోస్టర్ ఒకటి విడుదలైంది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
పొలిటికల్ పోస్టర్‌ని సినిమా పోస్టర్‌గా ఆసక్తిగా చూపించడం సుక్కుకే సాధ్యమైంది. ఊర్లో జరిగే పంచాయితీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో భాగంగా ముద్రించే పోస్టర్లనే సినిమా పోస్టర్‌గా బయటకు వదిలారు. ఈ పోస్టర్‌లో ‘ రంగస్థలం గ్రామపంచాయితీ ఎన్నికలలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా గ్రామ ప్రజలు బలపరిచిన కె.కుమార్ బాబు లాంతరు గుర్తుకే మీ ఓటు ముద్రను వేసి గెలిపించండి’ అని ఉంది. ఎంతైనా సుక్కు బ్రెయిన్ అంటే బ్రెయినే.
Comments
Please login to add a commentAdd a comment