
..అంటున్నారు రంగస్థలం మేకర్లు.. ఇంతకూ రామలక్ష్మి ఎవరంటే చిట్టిబాబు మనస్సు దోచిన అమ్మాయి. చెవిటివాడైన చిట్టిబాబుకు-రామలక్ష్మి మధ్య స్టోరీ ఏమిటంటే ‘రంగస్థలం’ సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాలి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా రాబోతున్న సినిమా ‘రంగస్థలం’.. ఇప్పటికే ఈ సినిమాలో రాంచరణ్ క్యారెక్టర్‌ను మేకర్లు రివీల్ చేశారు. చెవిటివాడైన చిట్టిబాబుగా.. అందరికీ సౌండ్ వినిపిస్తే.. తనకు కనిపిస్తుందంటూ చెర్రీ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఇక రేపు ఉదయం 11 గంటలకు రామలక్ష్మిని పరిచయం చేయబోతున్నారు. రామలక్ష్మిగా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సమంతతోపాటు రాంచరణ్, మైత్రీ మూవిస్ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. సమంత తన పాత్ర గురించి వివరిస్తూ.. రామలక్ష్మిగా నన్ను నేను ఎంత ఇష్టపడ్డానో.. మీరు కూడా అంతే ప్రేమిస్తారని ఆశిస్తున్నా.. భయం ఎరుగని శక్తిమంతురాలైన రామలక్ష్మి పాత్రను నాకు ఇచ్చినందుకు సుకుమార్‌కు కృతజ్ఞతలు.. రంగస్థలంలో ఈ పాత్ర లభించినందుకు గర్వపడుతున్నా’తెలిపారు.