డిసెంబర్‌లో డ్యాన్స్‌.. డ్యాన్స్‌! | Rangasthalam Rushes Pleases Rajamouli | Sakshi

డిసెంబర్‌లో డ్యాన్స్‌.. డ్యాన్స్‌!

Nov 17 2017 12:36 AM | Updated on Nov 17 2017 12:36 AM

Rangasthalam Rushes Pleases Rajamouli  - Sakshi

హెడ్డింగ్‌ చదవగానే రామ్‌చరణ్‌ కొత్త సంవత్సరానికి వెల్‌కమ్‌ చెప్పడానికి ప్లాన్‌ చేసుకుంటున్నారని అనుకుంటున్నారా? ఆ సెలబ్రేషన్స్‌ ఎలా ప్లాన్‌ చేస్తున్నారో తెలియడానికి ఇంకాస్త టైమ్‌ ఉంది. ఇప్పుడు చెప్పబోతున్నది సినిమా డ్యాన్స్‌ గురించి. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్, సమంత జంటగా ‘రంగస్థలం’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి నిర్మిస్తునారు.

కొంత టాకీ, సాంగ్స్‌ మినహా సినిమా పూర్తయింది. ఈ నెలాఖరుకల్లా టాకీ పార్ట్‌ని పూర్తి చేయాలనుకుంటున్నారు. డిసెంబర్‌లో డ్యాన్సులు... అదేనండీ సాంగ్‌ షూట్‌ మొదలుపెడతారు. జస్ట్‌ టూ వీక్స్‌లో పాటల చిత్రీకరణ పూర్తి చేయాలనుకుంటున్నారు. సో.. ఇయర్‌ ఎండింగ్‌కి చరణ్‌ ఫ్రీ అయిపోతారన్న మాట. మరి.. న్యూ ఇయర్‌ని ఇక్కడే సెలబ్రేట్‌ చేసుకుంటారో? అవుటాఫ్‌ కంట్రీ వెళతారో చూడాలి.

ఎందుకంటే 2016కి గుడ్‌బై చెప్పి, 2017కి వెల్‌కమ్‌ చెప్పేటప్పుడు రామ్‌చరణ్‌ తన వైఫ్‌ ఉపాసనతో కలసి స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. అక్కడే న్యూ ఇయర్‌ని సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆ సమయానికి మహేశ్‌బాబు తన భార్యాపిల్లలు నమ్రత, గౌతమ్, సితారలతో స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. వీళ్లందరూ కలసి పార్టీ చేసుకున్నారు. అన్నట్లు.. ‘రంగస్థలం’లో కొన్ని సీన్స్‌కి సంబంధించిన రష్‌ని చిరంజీవి, రాజమౌళి చూశారట. అవుట్‌పుట్‌ బ్రహ్మాండంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారట. ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement