
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పీరియాడిక్ డ్రామా రంగస్థలం. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాగుందని టాక్ రావడం, రాంచరణ్, సమంతతోపాటు ప్రధాన తారాగణం యాక్టింగ్ బాగుండటం ఈ సినిమాకు కలిసివచ్చినట్టు కనిపిస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘రంగస్థలం’ అటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ దుమ్మురేపుతోంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘రంగస్థలం’ అప్పుడే మన మిలియన్ మార్క్‌ను అధిగమించింది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు వసూళ్లు బాగుండటంతో ఈ సినిమా ఈ మార్క్‌ను అధిగమించింది. సినిమా టాక్ బాగుండటంతో వసూళ్ల విషయంలోనూ ఈ సినిమా దూసుకుపోవచ్చునని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment