
హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రాంచరణ్ తాజా సినిమా ‘రంగస్థలం’ బాక్సాఫీస్ సత్తా చాటుతోంది. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్ రావడంతో మంచి వసూళ్లు రాబడుతోంది. చిత్రవర్గాల సమాచారం ప్రకారం మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇందులో డిస్టిబ్యూటర్స్ వాటా రూ. 55 కోట్లు అని చిత్రవర్గాలు తెలిపాయి.
మొదటి వీకెండ్‌లో తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 37.40 కోట్లు వసూలు చేసింది. కర్ణాటకలో రూ. 4.8 కోట్లు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో రూ. 1.3 కోట్లు రాబట్టింది. ఇక, అమెరికాలోనూ ‘రంగస్థలం’ దుమ్మురేపుతోంది. మొదటి మూడురోజుల్లో ఈ సినిమా రూ. 9 కోట్లు వసూలుచేసింది. మిగతా దేశాల్లో రూ. 2.7 కోట్లు రాబట్టింది.
1980 నాటి గ్రామీణ రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమాలో రాంచరణ్.. వినికిడిలోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో అద్భుతంగా నటించాడు. చెర్రీ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్‌గా ఈ సినిమా నిలిచిపోతుందని ప్రశంసల జల్లు కురుస్తోంది. చెర్రీ సరసన నటించిన సమంత కూడా రామలక్ష్మి పాత్రలో మంచి అభినయం కనబర్చింది. రేవంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయ, ఆది పిన్నిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment