పెంకుటిల్లు.. గుమ్మంలో మట్టికుండలు.. గోల్డ్‌స్పాట్ కూల్ డ్రింకులు.. గోడలపై సినిమా పోస్టర్లు.. గోడలో అటకలు.. గోలీసోడాలు... బ్యాక్ టు ఎయిటీస్‌కి వెళితే ఎలాగుంటుందో? ఓసారి ఊహించుకోండి! వెళితే? ఎయిటీస్‌లోకి వెళ్లగలిగితే? బాగుంటుంది. కానీ, ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయని అనుకుంటున్నారా? రామ్‌చరణ్ ‘రంగస్థలం’లో! సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమా 1980 నేపథ్యంలోని కథతో రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
ఎయిటీస్‌లో కథ అయితే సరిపోతుందా? ప్రతి సన్నివేశంలోనూ అప్పటి వాతావారణం ప్రతిబింబించాలి కదా! అందుకే, 5 కోట్లతో హైదరాబాద్‌లో 80లలో గోదావరి జిల్లాల్లో పల్లెలు ఎలా ఉండేవో? అలాంటి సెట్ వేశారు. అదెలా ఉందో చెప్పడానికి జస్ట్ సాంపిల్... ఇన్‌సెట్‌లో ఫొటోలు! ‘‘విలేజ్ సెట్స్ చిన్ననాటి జ్ఞా³కాలను గుర్తు చేశాయి. ‘రంగస్థలం’ కు థాంక్యూ’’ అని రామ్‌చరణ్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీయమ్) నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. డిసెంబర్‌కి చిత్రీకరణ అంతా పూర్తి చేయాలని అనుకుంటున్నారట! హీరోయిన్‌గా సమంత, స్పెషల్ సాంగులో పూజా హెగ్డే కనిపించనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment