Rangastham 1985
-
చిక్కుల్లో ‘రంగమ్మ మంగమ్మ’
-
సుకుమార్ ఒడిలో రాంచరణ్..!
విలక్షణ సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్.. సినిమాల మీద అభిమానంతో లెక్కల మాస్టర్‌గా ఉద్యోగాన్ని వదులుకొని దర్శకత్వం వైపు అడుగులు వేసిన సుక్కు.. ఆర్య, ఆర్య-2, 100% లవ్, వన్, నాన్నకు ప్రేమతో.. సినిమాలతో తన మ్యాజిక్ ఏమిటో చూపించాడు. మొదటినుంచీ విభ్నిన్నమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ.. మంచి అభిరుచి ఉన్న ఫిల్మ్ మేకర్‌గా నిరూపించుకున్న సుకుమార్ జన్మదినం ఈరోజు (జనవరి 11).. ఈ సందర్భంగా సుక్కుకు రామ్‌చరణ్ వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. సుకుమార్ ఒడిలో కూర్చుని బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ మేరకు ఫొటోను చెర్రీ సతీమణి ఉపాసన ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. త్వరలోనే 'రంగస్థలం' మ్యాజిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదంటూ ఆమె పేర్కొన్నారు. రాంచరణ్ హీరోగా 'రంగస్థలం'ని సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 1985 నాటి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అప్పటి పరిస్థితులను, వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ప్రస్తుతం సుకుమార్ చాలా కష్టపడుతున్నాడు. -
మగధీరుడి గుర్రపుస్వారీ
మగధీర... సినిమా వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. అయినా... అందులో రామ్‌చరణ్ (చెర్రీ) గుర్రపుస్వారీ చేస్తూ చేసిన ఫైట్స్ ప్రేక్షకులకు ఇంకా గుర్తే! అంత త్వరగా మర్చిపోలేరులెండి! చెర్రీ కూడా మర్చిపోలేదు... హార్స్ రైడింగ్నీ, ‘మగధీర’లో హార్స్నీ! వీలున్నప్పుడు ఆ గుర్రంపై సరదాగా కాసేపు షికారుకు వెళ్తున్నారు. ‘మగధీర’లో రామ్‌చరణ్ రైడ్ చేసిన గుర్రం పేరు బాద్షా. సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుర్రాన్ని ఇంటికి తెచ్చుకుని ‘కాజల్’ అని పేరు పెట్టుకున్నారు. నిన్న (ఆదివారం) కాజల్‌పై కాసేపు షికారు చేశారు. ఆ ఫొటోలను చెర్రీ సతీమణి ఉపాసన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘‘రామ్‌చరణ్ ఈ వీకెండ్‌ని ‘మగధీర’లోని ఓల్డ్ ఫ్రెండ్‌తో స్పెండ్ చేస్తున్నాడు’’ అని ఉపాసన పేర్కొన్నారు. చిన్నప్పట్నుంచి చెర్రీకి హార్స్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన దగ్గర కాజల్‌తో పాటు మరికొన్ని గుర్రాలున్నాయి. ఇక, సినిమాల సంగతికొస్తే... ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రంగస్థలం’లో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ఉందండీ బాబూ...
ఉందా? లేదా? రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని వచ్చిన వార్త నిజమా? కాదా? అసలు ఆ సినిమా ఉందా? లేదా? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో సాగుతోంది. ఇక, ఆ చర్చ అవసరంలేదు. ఎందుకంటే ఈ సినిమా ఉందండి బాబూ. త్వరలో ఆరంభం కానుంది. ముహూర్తం కూడా పక్కాగా ఫైనలైజ్ చేసేశారు. డిసెంబర్లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాలను కుంటున్నారు. అది కూడా 15వ తేదీ తర్వాత. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. రామ్‌చరణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే... 1985 నేపథ్యంలో ‘రంగస్థలం’ రూపొందుతోంది. ఆ కాలాన్ని తలపించేలా హైదరాబాద్‌లో విలేజ్ సెట్ వేసిన విషయం తెలిసిందే. ఇక్కడ మీరు చూస్తోన్న ఫొటో ఆ సెట్‌కి సంబంధించినదే. ప్రస్తుతం ఆ సెట్లో ఓ ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో తీస్తున్న ఈ రిస్కీ ఫైట్‌ను రామ్‌చరణ్ అద్భుతంగా చేస్తున్నారని చిత్రబృందం అంటోంది. ఈ ఫైట్ ఎపిసోడ్లో సమంత కూడా కనిపిస్తారు. మరి.. తన వంతుగా విలన్లకు కోటింగ్ కూడా ఇస్తారా? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. గురువారం ఈ చిత్రానికి సంబంధిచిన ఓ పోస్టర్ హల్చల్ చేసింది. చిత్రబృందం అఫీషియల్‌గా విడుదల చేసిన పోస్టర్ కాకపోవడంతో.. ఇది ‘ఫ్యాన్ మేడ్ పోస్టర్’ అయ్యుంటుందేమో. అన్నట్లు... నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక.. ‘రంగస్థలం’ సెట్లోకి సమంత ఎంటర్ కావడం ఇదే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. -
ఎయిటీస్ రంగస్థలంలో రెట్రో రామ్‌చరణ్
పెంకుటిల్లు.. గుమ్మంలో మట్టికుండలు.. గోల్డ్‌స్పాట్ కూల్ డ్రింకులు.. గోడలపై సినిమా పోస్టర్లు.. గోడలో అటకలు.. గోలీసోడాలు... బ్యాక్ టు ఎయిటీస్‌కి వెళితే ఎలాగుంటుందో? ఓసారి ఊహించుకోండి! వెళితే? ఎయిటీస్లోకి వెళ్లగలిగితే? బాగుంటుంది. కానీ, ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయని అనుకుంటున్నారా? రామ్‌చరణ్ ‘రంగస్థలం’లో! సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ సినిమా 1980 నేపథ్యంలోని కథతో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎయిటీస్‌లో కథ అయితే సరిపోతుందా? ప్రతి సన్నివేశంలోనూ అప్పటి వాతావారణం ప్రతిబింబించాలి కదా! అందుకే, 5 కోట్లతో హైదరాబాద్‌లో 80లలో గోదావరి జిల్లాల్లో పల్లెలు ఎలా ఉండేవో? అలాంటి సెట్ వేశారు. అదెలా ఉందో చెప్పడానికి జస్ట్ సాంపిల్... ఇన్సెట్లో ఫొటోలు! ‘‘విలేజ్ సెట్స్ చిన్ననాటి జ్ఞా³కాలను గుర్తు చేశాయి. ‘రంగస్థలం’ కు థాంక్యూ’’ అని రామ్‌చరణ్ ఫేస్బుక్లో పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీయమ్) నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. డిసెంబర్‌కి చిత్రీకరణ అంతా పూర్తి చేయాలని అనుకుంటున్నారట! హీరోయిన్గా సమంత, స్పెషల్ సాంగులో పూజా హెగ్డే కనిపించనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. -
పవన్ కోసం చరణ్..?
రామ్ చరణ్ ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఆవేశంగా మాట్లాడి వివాదాలను కొని తెచ్చుకున్న ఈ మెగా పవర్ స్టార్ ఇప్పుడు మాత్రం యువ కథానాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అంతేకాదు తన ఫ్యామిలీ హీరోలతో పోటి వస్తే తానే బరినుంచి తప్పుకొని అభిమానుల మనసు గెలుచుకుంటున్నాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న రంగస్థలం 1985 విషయంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు చెర్రీ. ముందుగా ఈ సినిమాను 2018లో జనవరిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. అయితే అక్టోబర్‌లో రిలీజ్ అవుతుందనుకున్న పవన్, త్రివిక్రమ్ సినిమా ఆలస్యమవుతుండటంతో ఆ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో బాబాయ్ సినిమాతో పోటి పడటం ఇష్టం లేని చరణ్ తన సినిమా డిసెంబర్ నెలాఖరునే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడట. గతంలోనూ ఇలాంటి త్యాగమే చేశాడు చెర్రీ. 2017 సంక్రాంతి బరిలో ధృవ సినిమాతో సత్తా చాటలని భావించాడు. అయితే అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150 రిలీజ్ చేయాల్సి రావటంతో ఒక నెల ముందుగానే ధృవ సినిమాను రిలీజ్ చేశాడు. ఇండస్ట్రీకి అన్‌సీజన్‌గా చెప్పుకునే డిసెంబర్లో కూడా ధృవ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మెగా పవర్ చూపించింది. మరి మరోసారి అదే ఫీట్ రిపీట్ చేస్తాడేమో చూడాలి.