సుకుమార్‌ ఒడిలో రాంచరణ్‌..! | RamCharan wishes director Sukumar happy birth day | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 11 2018 7:49 PM | Last Updated on Thu, Jan 11 2018 7:49 PM

RamCharan wishes director Sukumar happy birth day - Sakshi

విలక్షణ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్‌.. సినిమాల మీద అభిమానంతో లెక్కల మాస్టర్‌గా ఉద్యోగాన్ని వదులుకొని దర్శకత్వం వైపు అడుగులు వేసిన సుక్కు.. ఆర్య, ఆర్య-2, 100% లవ్‌, వన్‌, నాన్నకు ప్రేమతో.. సినిమాలతో తన మ్యాజిక్‌ ఏమిటో చూపించాడు. మొదటినుంచీ విభ్నిన్నమైన కథలతో సినిమాలు తెరకెక్కిస్తూ.. మంచి అభిరుచి ఉన్న ఫిల్మ్‌ మేకర్‌గా నిరూపించుకున్న సుకుమార్‌ జన్మదినం ఈరోజు (జనవరి 11).. ఈ సందర్భంగా సుక్కుకు రామ్‌చరణ్‌ వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. సుకుమార్‌ ఒడిలో కూర్చుని బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ మేరకు ఫొటోను చెర్రీ సతీమణి ఉపాసన ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు.

త్వరలోనే 'రంగస్థలం' మ్యాజిక్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదంటూ ఆమె పేర్కొన్నారు. రాంచరణ్‌ హీరోగా 'రంగస్థలం'ని సుకుమార్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 1985 నాటి నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అప్పటి పరిస్థితులను, వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించేందుకు ప్రస్తుతం సుకుమార్‌ చాలా కష్టపడుతున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement