ఉందా? లేదా? రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తారని వచ్చిన వార్త నిజమా? కాదా? అసలు ఆ సినిమా ఉందా? లేదా? అనే చర్చ ఫిల్మ్‌నగర్‌లో సాగుతోంది. ఇక, ఆ చర్చ అవసరంలేదు. ఎందుకంటే ఈ సినిమా ఉందండి బాబూ. త్వరలో ఆరంభం కానుంది. ముహూర్తం కూడా పక్కాగా ఫైనలైజ్ చేసేశారు. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించాలను కుంటున్నారు. అది కూడా 15వ తేదీ తర్వాత. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.
రామ్‌చరణ్ ఇమేజ్‌కి తగ్గట్టుగా బోయపాటి మార్క్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఎక్కడ జరుగుతోందంటే... 1985 నేపథ్యంలో ‘రంగస్థలం’ రూపొందుతోంది. ఆ కాలాన్ని తలపించేలా హైదరాబాద్‌లో విలేజ్ సెట్ వేసిన విషయం తెలిసిందే. ఇక్కడ మీరు చూస్తోన్న ఫొటో ఆ సెట్‌కి సంబంధించినదే. ప్రస్తుతం ఆ సెట్‌లో ఓ ఫైట్ సీక్వెన్స్ తీస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఆధ్వర్యంలో తీస్తున్న ఈ రిస్కీ ఫైట్‌ను రామ్‌చరణ్ అద్భుతంగా చేస్తున్నారని చిత్రబృందం అంటోంది.
ఈ ఫైట్ ఎపిసోడ్‌లో సమంత కూడా కనిపిస్తారు. మరి.. తన వంతుగా విలన్లకు కోటింగ్ కూడా ఇస్తారా? అన్నది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. గురువారం ఈ చిత్రానికి సంబంధిచిన ఓ పోస్టర్ హల్‌చల్ చేసింది. చిత్రబృందం అఫీషియల్‌గా విడుదల చేసిన పోస్టర్ కాకపోవడంతో.. ఇది ‘ఫ్యాన్ మేడ్ పోస్టర్’ అయ్యుంటుందేమో. అన్నట్లు... నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక.. ‘రంగస్థలం’ సెట్‌లోకి సమంత ఎంటర్ కావడం ఇదే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త.
Comments
Please login to add a commentAdd a comment