మగధీర... సినిమా వచ్చి ఎనిమిదేళ్లు అవుతోంది. అయినా... అందులో రామ్‌చరణ్ (చెర్రీ) గుర్రపుస్వారీ చేస్తూ చేసిన ఫైట్స్ ప్రేక్షకులకు ఇంకా గుర్తే! అంత త్వరగా మర్చిపోలేరులెండి! చెర్రీ కూడా మర్చిపోలేదు... హార్స్ రైడింగ్‌నీ, ‘మగధీర’లో హార్స్‌నీ! వీలున్నప్పుడు ఆ గుర్రంపై సరదాగా కాసేపు షికారుకు వెళ్తున్నారు. ‘మగధీర’లో రామ్‌చరణ్ రైడ్ చేసిన గుర్రం పేరు బాద్‌షా. సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత గుర్రాన్ని ఇంటికి తెచ్చుకుని ‘కాజల్’ అని పేరు పెట్టుకున్నారు. నిన్న (ఆదివారం) కాజల్‌పై కాసేపు షికారు చేశారు.
ఆ ఫొటోలను చెర్రీ సతీమణి ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘‘రామ్‌చరణ్ ఈ వీకెండ్‌ని ‘మగధీర’లోని ఓల్డ్ ఫ్రెండ్‌తో స్పెండ్ చేస్తున్నాడు’’ అని ఉపాసన పేర్కొన్నారు. చిన్నప్పట్నుంచి చెర్రీకి హార్స్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన దగ్గర కాజల్‌తో పాటు మరికొన్ని గుర్రాలున్నాయి. ఇక, సినిమాల సంగతికొస్తే... ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రంగస్థలం’లో రామ్‌చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment