
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సినిమా సినిమాకు తన గ్రాఫ్‌ని పెంచుకుంటున్నాడు. కేవలం నటన పరంగానే కాకుండా కథల ఎంపికలోనూ కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. రొటీన్ సినిమాలు చేయకుండా.. కొత్త ప్రయోగాలు చేస్తూ స్టార్‌గా ఎదిగాడు. అయితే స్టార్ హోదా రావడం ఎంత ముఖ్యమో ఆ హోదాను కాపాడుకోవడం అంతే ముఖ్యం. ఈ విషయం రామ్‌చరణ్‌కు బాగా తెలుసు. కథతో పాటు తన గెటప్ కూడా కొత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు హీరో రామ్‌చరణ్. దానికోసం ఆయన పడే కష్టం అంతాఇంత కాదు.
ఫిట్‌నెస్ ఈ మెగాపవర్ స్టార్ చాలా కష్టపడతాడు. తాజాగా వైరల్ అయిన ఫోటోనే అందుకు నిదర్శనం. స్ట్రాంగ్ మార్నింగ్ అంటూ మంగళవారం రామ్‌చరణ్ ఓ ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు. అందులో కండలు తిరిగినే శరీరంతో నయా లుక్‌లో రామ్‌చరణ్ అద్భుతంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రామ్ చరణ్ ఇచ్చిన స్టిల్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిస్తోంది. ఆ ఫిట్నెస్ ఏంటి సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రామ్‌చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో పాటు, కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’లోనూ నటిస్తున్నాడు.