బర్త్‌డే మంత్‌లో స్టార్ట్‌! | Rajamouli's film with Jr NTR and Ram Charan begin? | Sakshi
Sakshi News home page

బర్త్‌డే మంత్‌లో స్టార్ట్‌!

Published Thu, Jan 4 2018 12:18 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Rajamouli's film with Jr NTR and Ram Charan begin? - Sakshi

ఇక్కడ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌... ముగ్గురి ఫొటోలున్నాయి. ఎవరి బర్త్‌డే మంత్‌లో ఏం స్టార్ట్‌ కాబోతోంది అనుకుంటున్నారా? పుట్టినరోజు నెల రాజమౌళిది. స్టార్ట్‌ కాబోతున్నది సినిమా. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ క్రేజీ కాంబినేషన్‌లో రాజమౌళి ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడు మొదలుపెడతారు? అనే విషయంలో చిన్నపాటి క్లారిటీ వచ్చింది. అక్టోబర్‌లో స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారట. రాజమౌళి పుట్టింది ఆ నెలలోనే. పదో నెల పదో తేదీన పుట్టారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది.

మరోవైపు ఎన్టీఆర్‌ త్వరలో త్రివిక్రమ్‌తో సినిమా మొదలుపెట్టనున్నారు. అక్టోబర్‌కల్లా ఈ మూవీ కంప్లీట్‌ అవుతుంది. ఇక రామ్‌చరణ్‌ ఆల్రెడీ ‘రంగస్థలం’తో బిజీగా ఉన్నారు. ఈ నెలలోనే ఈ సినిమా పూర్తవుతుంది. ఇదే నెలలోనే బోయపాటి దర్శకత్వంలో చరణ్‌ చేయనున్న సినిమా మొదలవుతుంది. ఇది కూడా అక్టోబర్‌కల్లా పూర్తయిపోతుంది. సో.. రాజమౌళి సినిమా చేయడానికి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ పదో నెలకి ఫ్రీ అయిపోతారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement