అప్పుడలా.. ఇప్పుడిలా.. | SS Rajamouli with Jr NTR In Old Memories Of RRR Shooting | Sakshi
Sakshi News home page

అప్పుడలా.. ఇప్పుడిలా..

Published Sat, Sep 28 2019 12:46 AM | Last Updated on Sat, Sep 28 2019 11:22 AM

SS Rajamouli with Jr NTR In Old Memories Of RRR Shooting - Sakshi

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లొకేషన్లో...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌తో బిజీ బిజీగా ఉన్నారు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎన్టీఆర్‌ మీద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్‌ తీస్తున్నప్పుడు రాజమౌళి–ఎన్టీఆర్‌ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లారు. 18 ఏళ్ల క్రితం సెప్టెంబర్‌ 27న రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్‌ నెం.1’ రిలీజ్‌ అయింది. దర్శకుడిగా రాజమౌళికి అది మొదటి సినిమా. హీరోగా ఎన్టీఆర్‌కి ఫస్ట్‌ బ్లాక్‌బస్టర్‌. ‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రీకరించిన స్టూడియోలోనే ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ జరుగుతోంది.


                                              ‘స్టూడెంట్‌ నెం.1’ లొకేషన్లో...

18 ఏళ్ల క్రితం షూటింగ్‌ జ్ఞాపకాల్ని మరోసారి గుర్తుచేసుకున్నారు ఎన్టీఆర్, రాజమౌళి. గుర్తు చేసుకోవడమే కాదు.. పాత ఫోటోల స్టిల్స్‌లాగానే మరోసారి పోజులిచ్చారు కూడా. ‘‘18 ఏళ్లవుతోంది ‘స్టూడెంట్‌ నెం.1’ చిత్రం రిలీజ్‌ అయి. అదే లొకేషన్‌లో ఇవాళ మళ్లీ షూట్‌ చేస్తున్నాం. ఈ 18 ఏళ్లలో చాలా మారాయి. కానీ రాజమౌళితో పని చేయడంలో ఉండే ఫన్‌ మాత్రం మారలేదు’’ అని ఒక ఫోటోను ఎన్టీఆర్‌ షేర్‌ చేశారు. ‘‘ఈ 18 ఏళ్లలో ఎన్నో మారాయి. తను (ఎన్టీఆర్‌) సన్నగా అయ్యాడు, నేను పెద్ద అయ్యాను. మేమిద్దరం ఇంకాస్త తెలివిగలవాళ్లమయ్యాం’’ అని రాజమౌళి ఓ ఫోటోను షేర్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement