కేరళకు మెగా ఫ్యామిలీ మెగా విరాళం! | Mega Family Donation to Karala Floods Victim | Sakshi
Sakshi News home page

Aug 18 2018 7:04 PM | Updated on Aug 18 2018 7:16 PM

Mega Family Donation to Karala Floods Victim - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారీ వరదలతో అల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు మెగా ఫ్యామిలీ ముందుకొచ్చింది. కేరళ వరద బాధితుల సహాయార్థం చిరంజీవి తల్లి అంజనాదేవి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇక, మెగాస్టార్‌ చిరంజీవి తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని కేరళకు ప్రకటించగా.. ఆయన తనయుడు రాంచరణ్‌ రూ. 25 లక్షలు విరాళాన్ని ప్రకటించగా.. రాంచరణ్‌ సతీమణి ఉపాసన రూ. పదిలక్షల విరాళాన్ని అందజేయనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు.

వరదలతో అస్తవ్యస్తమైన కేరళకు రూ. 10 లక్షల విరాళం ఇవ్వనున్నట్టు టాలీవుడ్‌కు చెందిన మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ప్రకటించింది. ‘మన భూతల స్వర్గం 80 శాతం మునిగిపోయింది. దీన్ని టీవీలో చూస్తుంటే బాధగా ఉంది. ‘మా’  రూ.10 లక్షలు విరాళం ఇస్తుంది. అలాగే ఆర్టిస్టులు కూడా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నా’ అని మా ప్రెసిడెంట్‌ శివాజీ రాజా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement