కొణిదెల ఫ్యామిలీ లంచ్‌: హాజరైన పవన్‌! | Konidala familybonding over Athamas amazing lunch, tweets upasana | Sakshi
Sakshi News home page

Mar 27 2018 6:29 PM | Updated on Mar 22 2019 5:33 PM

Konidala familybonding over Athamas amazing lunch, tweets upasana - Sakshi

మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌ పుట్టినరోజు వేడుకలు మంగళవారం అత్యంత అట్టహాసంగా జరిగాయి. చరణ్‌ బర్త్‌డే సందర్భంగా మెగా ఫ్యామిలీ కలిసి లంచ్‌ చేసింది. చిరంజీవి సతీమణి సురేఖ ఇచ్చిన ఈ విందుకు జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ హాజరుకావడం గమనార్హం. చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా అత్తమ్మ అమేజింగ్‌ లంచ్‌ ఏర్పాటుచేసిందని, ఈ వేడుకల్లో కొణిదెల కుటుంబమంతా కలిసిపోయిందని సురేఖతో చిరంజీవి, చరణ్‌, పవన్‌ కలిసి దిగిన ఫొటోను ఉపాసన ట్వీట్‌ చేశారు. హ్యాపీ బర్త్‌డే మిస్టర్‌ సీ అంటూ పూలతో రాసి.. భర్త చరణ్‌కు ఆమె వినూత్నంగా విషెస్‌ తెలిపారు. కొణిదెల ఫ్యామిలీ బాండింగ్‌ ఫొటోతో ఈ ఫొటోను కూడా ట్వీట్‌ చేసింది. 

‘రంగస్థలం’ సినిమాతో ఈ నెల 30వతేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న రాంచరణ్‌ పుట్టినరోజు సందర్భంటా సోషల్‌ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగా హీరోలు సాయి ధరం తేజ్‌, వరుణ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌తోపాటు పలువురు నటీనటులు రాంచరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ ఇవ్వాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement