ప్రముఖ హీరో రాంచరణ్ ఇంటి ముందు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి వంశస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుంచి తీసుకున్నారని, అలాగే షూటింగ్ పేరుతో తమ పొలాలను నాశనం చేసి నష్టపరిహారం చెల్లించకుండా బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నష్ట పరిహారంపై షూటింగ్ సమయంలో ఒప్పందం చేసుకుని ఇప్పుడు అది చెల్లదంటున్నారని వాపోతున్నారు.