
చూశారా..! అదేనండి ‘రంగస్థలం’ సినిమాలో సమంత లుక్‌ని చుశారా? అని ఎవర్నైనా అడిగితే.. చూడలేదనే చెప్తారు. అఫ్‌కోర్స్ యూనిట్ సభ్యులకు ఆమె లుక్ తెలుసనుకోండి. ఈ సినిమాలో సమంత పల్లెటూరి పిల్లలా కనిపిస్తారని తెలుసు. ఆ లుక్‌లో ఆమె ఎంత అందంగా ఉంటారో కూడా ఊహించవచ్చు. కానీ, ఊహల్లో చూడ్డంకన్నా అసలైన లుక్ ఏంటో బయటపెడితే చూడాలని ఉంటుంది కదా. అందుకే జూలై నెలలో రాజమండ్రిలో ‘రంగస్థలం’ సినిమా షూట్ జరిగినప్పుడు సమంత ఓ లుక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పుడు ‘కొంచెం టర్నింగ్ ఇచ్చుకోమ్మా’ అని చాలామంది అన్నారు.
అందులో సమంత ఫేస్ కనిపించలేదు. ఇప్పుడు కూడా సమంత బ్యాక్ లుక్ బయటికొచ్చింది. సాగర తీరాన దీర్ఘాలోచనలో నిలబడ్డారు. కొందరు నెటిజన్లు ఇది సమంత లుక్ అని అంటుంటే.. మరికొందరు కాదేమో అంటున్నారు. ఏదేమైనా సమంత లుక్‌ని చూసేందుకు ఇంకా టైమ్ ఉంది. మరి.. చిత్రదర్శకుడు సుకుమార్ లుక్ రిలీజ్ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారో? రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ ‘రంగస్థలం’ కోసం ఇటీవల ఓ పాట చిత్రీకరించారు. త్వరలో మరో షెడ్యూల్‌ని స్టార్ట్ చేయనున్నారు.