ranghasthalam
-
రంగస్థలంపై మహేష్ ప్రశంసల జల్లు
సాక్షి, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా రంగస్థలం. ఈ సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. మార్చి 30న విడుదలైన ఈ చిత్రంపై పరిశ్రమలోని అందరి దగ్గర నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేరారు. రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్, సమంత అద్భుతంగా నటించారని ఆకాశానికి ఎత్తేశారు. వారి కెరీర్లో ఇది అత్యుత్తమ ప్రదర్శనగా ఉంటుందని మహేష్ బాబు తన ట్వీటర్లో పేర్కొన్నారు. అంతేకాకుండా దర్శకుడు సుకుమార్ తనదైన శైలిలో సినిమాని తెరకెక్కించాడని మహేష్ అన్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ ఇచ్చాడని అందులో పేర్కొన్నారు. రత్నవేలును కూడా మహేష్ ప్రశంసించారు. ఈ సినిమా రిలీజ్ అయిన తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్లోనూ రికార్డ్ కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూడు రోజులకే వందకోట్ల గ్రాస్‌ను సాధించి సత్తా చాటింది. చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. .@MythriOfficial as producers have excelled once more :) Ram Charan & @Samanthaprabhu2 this surely is your career-best performance.Congratulations to the whole team 👍Thoroughly enjoyed it :) — Mahesh Babu (@urstrulyMahesh) April 6, 2018 -
మోత మోగిపోద్ది
అందరికీ సౌండ్ వినపడుతుంది. కానీ నాకు మాత్రం కనపడుతుందండి అంటున్నాడు చిట్టిబాబు. అదేనండీ.. తనకు వినికిడి లోపం ఉన్న విషయాన్ని స్టైలిష్‌గా చెబుతున్నాడు. అంతేకాదండోయ్.. ఆ ఊరికి చిట్టిబాబే ఇంజనీర్. అందుకే అందరూ చిట్టిబాబును సౌండ్ ఇంజనీర్ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఇదంతా ఓకే కానీ.. చిట్టిబాబుకు సౌండ్ వినిపించకపోయినా లిప్ మూమెంట్లో తేడా కనిపించిందో అంతే.. రీసౌండ్ మోత మోగిపోతుంది. అది ఏ రేంజ్లో అనేది తెరపై చూడండి అంటున్నారు ‘రంగస్థలం’ చిత్రబృందం. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రంగస్థలం’ టీజర్‌ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, అనసూయ కీలకపాత్రలు చేస్తున్నారు. ‘‘యూనిక్ క్యారెక్టరైజేషన్‌ను తెరకెక్కిస్తున్న దర్శకుడు సుకుమార్‌కి థ్యాంక్స్. షూటింగ్లో ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేస్తున్నాం’’ అని హీరో రామ్‌చరణ్ టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. టీజర్లో రామ్‌చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని కొందరు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. గోదావరి యాసలో రామ్‌చరణ్ చెప్పిన డైలాగ్స్ సూపర్‌గా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. టీజర్ రిలీజైన ఆరు గంటల్లోపు 40 లక్షలు డిజిటల్ వ్యూస్ వచ్చాయని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. -
తప్పెట మోత.. చిట్టిబాబు ఆట
ఊరు హోరేత్తేలా తప్పెట మోత మోగుతుంది. గుండెలు ఝల్లుమనేలా గజ్జెలు గల్లు గల్లుమంటున్నాయి. అక్కడికి చిట్టిబాబు ఎంట్రీ ఇచ్చాడు. ఆ నెక్ట్స్ ఏంటి?... అంటే ప్రస్తుతానికి ఇంతే. బ్యాలెన్స్ వెండితెరపై చూస్తే ఫ్యాన్స్ ఈల కొట్టి గోల పెట్టడం ఖాయం అంటున్నారు ‘రంగస్థలం’ చిత్రబృందం. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. లేటెస్ట్ షెడ్యూల్ మంగళవారం మొదలైంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్‌లో తప్పెట డ్యానర్స్ పాల్గొంటున్నారు. ‘‘రంగస్థలం’ సెట్లో మళ్లీ ఫోక్ ఆర్ట్స్ గురించి తెలుసుకుంటున్నాను. మా సినిమాలోని తప్పెట డ్యాన్సర్స్‌ను మీట్ అవ్వండి’’ అని మీరు చూస్తున్న ఫొటోను రామ్‌చరణ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ‘‘సినిమాలోని కీలకమైన సన్నివేశాల కోసం తప్పెట ఆటగాళ్లను వెస్ట్ గోదావరి నుంచి పిలిపించాం. కథలో కీలకమైన ఎపిసోడ్లో ఈ సీన్స్ ఉంటాయి. ఈ షెడ్యూల్ నెలాఖరు వరకు సాగుతుంది’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇందులో రామ్‌చరణ్ పాత్ర పేరు చిట్టిబాబు అని తెలిసిందే. మార్చి 30న చిత్రం విడుదల కానుంది. -
కొంచెం టర్నింగ్ ఇచ్చుకోమ్మా!
చూశారా..! అదేనండి ‘రంగస్థలం’ సినిమాలో సమంత లుక్‌ని చుశారా? అని ఎవర్నైనా అడిగితే.. చూడలేదనే చెప్తారు. అఫ్కోర్స్ యూనిట్ సభ్యులకు ఆమె లుక్ తెలుసనుకోండి. ఈ సినిమాలో సమంత పల్లెటూరి పిల్లలా కనిపిస్తారని తెలుసు. ఆ లుక్‌లో ఆమె ఎంత అందంగా ఉంటారో కూడా ఊహించవచ్చు. కానీ, ఊహల్లో చూడ్డంకన్నా అసలైన లుక్ ఏంటో బయటపెడితే చూడాలని ఉంటుంది కదా. అందుకే జూలై నెలలో రాజమండ్రిలో ‘రంగస్థలం’ సినిమా షూట్ జరిగినప్పుడు సమంత ఓ లుక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పుడు ‘కొంచెం టర్నింగ్ ఇచ్చుకోమ్మా’ అని చాలామంది అన్నారు. అందులో సమంత ఫేస్ కనిపించలేదు. ఇప్పుడు కూడా సమంత బ్యాక్ లుక్ బయటికొచ్చింది. సాగర తీరాన దీర్ఘాలోచనలో నిలబడ్డారు. కొందరు నెటిజన్లు ఇది సమంత లుక్ అని అంటుంటే.. మరికొందరు కాదేమో అంటున్నారు. ఏదేమైనా సమంత లుక్‌ని చూసేందుకు ఇంకా టైమ్ ఉంది. మరి.. చిత్రదర్శకుడు సుకుమార్ లుక్ రిలీజ్ ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేశారో? రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ ‘రంగస్థలం’ కోసం ఇటీవల ఓ పాట చిత్రీకరించారు. త్వరలో మరో షెడ్యూల్‌ని స్టార్ట్ చేయనున్నారు. -
రంగస్థలంలో రసమలై
రోటీ, పన్నీర్ కర్రీ, మాంచి మటన్ బిర్యానీ, చికెన్ పకోడీ.... మెనూలో నోరూరించే ఫుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నా, చివర్లో చిన్న స్వీట్ (ఫర్ ఎగ్జాంపుల్.. రసమలై) తింటే వచ్చే కిక్కు కొంచెం స్పెషల్! ఎందుకంటే... అదంతే! సినిమాల్లోనూ అందమైన ప్రేమకథ, అనుబంధాలు, యాక్షన్–సెంటిమెంట్ సీన్స్, మెలోడీలు ఎన్ని ఉన్నా, స్పెషల్ సాంగులు ఆడియన్స్‌కి కొంచెం ఎక్స్ట్రా కిక్ ఇస్తాయి. ‘రంగస్థలం’లో అటువంటి కిక్ ఇచ్చేందుకు పూజా హెగ్డే రెడీ అవుతున్నారు. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీయమ్) నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో పూజా హెగ్డే స్పెషల్ సాంగులో చరణ్‌తో స్టెప్పులేయనున్నారు. ఈ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ మాంచి మాసీ ట్యూన్ రెడీ చేశారట. సుకుమార్–దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఐటమ్ సాంగులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ! దాంతో ప్రేక్షకుల్లో ఈ పాటపై ఆల్రెడీ అంచనాలు మొదలయ్యాయి. చరణ్ మంచి డ్యాన్సర్. ‘దువ్వాడ జగన్నాథమ్’లో పూజా కూడా డ్యాన్స్ బాగా చేశారు. సో, ‘రంగస్థలం’లో ఇద్దరూ ఎంతలా ఇరగదీస్తారో!! -
1985లోని ఓ పల్లెటూరి ప్రేమకథ...రంగస్థలం
ఈ ప్రపంచమే ఓ రంగస్థలం. అందులో మనుషులంతా పాత్రధారులే. ఎవరి పాత్రలో (జీవితంలో) వాళ్లు నటిస్తుంటారని అన్నారో కవి. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ కూడా ఈ మాటే అంటున్నారు. ఆయన ఊహా ప్రపంచాన్ని ‘రంగస్థలం’గా అభివర్ణించారు. ఇందులో రామ్‌చరణ్, సమంత, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, ఆది పాత్రధారులు. ఇంకా అర్థం కాలేదా? రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ (సీవీయం) నిర్మిస్తున్న సినిమాకు ‘రంగస్థలం’ అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. 1985... అనేది ఉపశీర్షిక. 1985 కాలంనాటి కథతో రూపొందుతోన్న ప్రేమకథా చిత్రమిదని సమాచారం. ‘‘ఇప్పటివరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్నారు. వినూత్న కథతో, ప్రేక్షకులను అలరించే వాణిజ్య హంగులతో సుకుమార్ ఈ చిత్రాన్ని తీస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.