
అందరికీ సౌండ్ వినపడుతుంది. కానీ నాకు మాత్రం కనపడుతుందండి అంటున్నాడు చిట్టిబాబు. అదేనండీ.. తనకు వినికిడి లోపం ఉన్న విషయాన్ని స్టైలిష్‌గా చెబుతున్నాడు. అంతేకాదండోయ్.. ఆ ఊరికి చిట్టిబాబే ఇంజనీర్. అందుకే అందరూ చిట్టిబాబును సౌండ్ ఇంజనీర్ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఇదంతా ఓకే కానీ.. చిట్టిబాబుకు సౌండ్ వినిపించకపోయినా లిప్ మూమెంట్‌లో తేడా కనిపించిందో అంతే.. రీసౌండ్ మోత మోగిపోతుంది.
అది ఏ రేంజ్‌లో అనేది తెరపై చూడండి అంటున్నారు ‘రంగస్థలం’ చిత్రబృందం. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయిక. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రంగస్థలం’ టీజర్‌ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, అనసూయ కీలకపాత్రలు చేస్తున్నారు.
‘‘యూనిక్ క్యారెక్టరైజేషన్‌ను తెరకెక్కిస్తున్న దర్శకుడు సుకుమార్‌కి థ్యాంక్స్. షూటింగ్‌లో ప్రతి సీన్‌ను ఎంజాయ్ చేస్తున్నాం’’ అని హీరో రామ్‌చరణ్ టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. టీజర్‌లో రామ్‌చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని కొందరు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. గోదావరి యాసలో రామ్‌చరణ్ చెప్పిన డైలాగ్స్ సూపర్‌గా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. టీజర్ రిలీజైన ఆరు గంటల్లోపు 40 లక్షలు డిజిటల్ వ్యూస్ వచ్చాయని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment