నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సుకుమార్, చెరుకూరి మోహన్
‘‘1980 బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ ఉంటుంది కాబట్టి అందుకు తగట్టుగా సెట్ డిజైన్ చేశారు ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనికా. నా టీమ్ అందరూ చాలా బాగా సహకరించారు. ఎక్కడా రాజీ పడకుండా మేం ఏది అడిగితే అది ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్. ఈ సినిమా నిడివి 2గంటల 50 నిమిషాలు. ఎక్కడా తగ్గించొద్దు. అలానే రిలీజ్ చేయమని చిరంజీవిగారు చెప్పడంతో మాకు కొండంత ధైర్యం వచ్చింది. అనసూయ ‘రంగమ్మత్త’ కారెక్టర్‌కి వంద శాతం న్యాయం చేశారు.
నరేశ్ బాగా యాక్ట్ చేశారు. సినిమాలో కామెడీ సెపరేటుగా ఉండదు. క్యారెక్టర్స్‌లోనే కామెడీ ఉంటుంది. థియేటర్స్‌కి తెల్ల కాగితంలా రండి. ఓ మంచి సినిమా చూడండి. అద్భుతమైన ఫీల్ కలుగుతుందని గ్యారెంటీగా చెప్పగలను. ఎక్స్‌పెక్టేషన్స్‌తో రావద్దు’’ అన్నారు సుకుమార్. రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ‘రంగస్థలం’ ఈరోజు విడుదలవుతోంది.
ఈ సందర్భంగా ‘రంగస్థలం’ విలేజ్ సెట్‌లో చిత్రబృందం విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు.నవీన్ ఎర్నేనీ మాట్లాడుతూ –‘‘రంగ స్థలం’ సినిమాను వరల్డ్‌వైడ్‌గా 1700 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. సినిమాకు టీజర్ దగ్గర నుంచి మంచి హైప్ క్రియేట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉన్న అంచనాలను రీచ్ అవుతాం. ఇంత మంచి మూవీని మా బ్యానర్‌కు అందించిన సుకుమార్‌కి, రామ్‌చరణ్‌కు థ్యాంక్స్. చరణ్ నటన ఈ సినిమాలో పీక్స్‌లో ఉంటుంది.
ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని ఎగై్జటెడ్‌గా ఉన్నాం’’ అన్నారు. ‘‘టాలీవుడ్ స్వర్ణయుగాన్ని చూస్తోంది. ప్రతి ఏడాది 2–3 అద్భుతమైన హిట్స్ వస్తున్నాయి. సుకుమార్‌గారు చేసిన సినిమాలన్నింటిలో ‘రంగస్థలం’ బెస్ట్ స్క్రీన్ ప్లే. నాకు మంచి క్యారెక్టర్ డిజైన్ చేశారు. న్యాయం చేశాననే అనుకుంటున్నాను. చరణ్ నటన అద్భుతంగా ఉంటుంది. నేషనల్ అవార్డు వస్తుంది’’ అన్నారు నరేశ్.‘‘నా ఫేవరెట్ యాక్టర్ చరణ్‌కు అత్తగా నటించడం థ్రిల్లింగ్‌గా ఉంది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేక్యారెక్టర్ చేద్దాం అనుకునే టైమ్‌లో సుకుమార్‌గారు ఈ పాత్ర ఇచ్చారు’’ అన్నారు అనసూయ.
Comments
Please login to add a commentAdd a comment