
రోటీ, పన్నీర్ కర్రీ, మాంచి మటన్ బిర్యానీ, చికెన్ పకోడీ.... మెనూలో నోరూరించే ఫుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నా, చివర్లో చిన్న స్వీట్ (ఫర్ ఎగ్జాంపుల్.. రసమలై) తింటే వచ్చే కిక్కు కొంచెం స్పెషల్! ఎందుకంటే... అదంతే! సినిమాల్లోనూ అందమైన ప్రేమకథ, అనుబంధాలు, యాక్షన్–సెంటిమెంట్ సీన్స్, మెలోడీలు ఎన్ని ఉన్నా, స్పెషల్ సాంగులు ఆడియన్స్‌కి కొంచెం ఎక్స్‌ట్రా కిక్ ఇస్తాయి. ‘రంగస్థలం’లో అటువంటి కిక్ ఇచ్చేందుకు పూజా హెగ్డే రెడీ అవుతున్నారు.
రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీయమ్) నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో పూజా హెగ్డే స్పెషల్ సాంగులో చరణ్‌తో స్టెప్పులేయనున్నారు. ఈ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ మాంచి మాసీ ట్యూన్ రెడీ చేశారట. సుకుమార్–దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో ఐటమ్ సాంగులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదూ! దాంతో ప్రేక్షకుల్లో ఈ పాటపై ఆల్రెడీ అంచనాలు మొదలయ్యాయి. చరణ్ మంచి డ్యాన్సర్. ‘దువ్వాడ జగన్నాథమ్’లో పూజా కూడా డ్యాన్స్ బాగా చేశారు. సో, ‘రంగస్థలం’లో ఇద్దరూ ఎంతలా ఇరగదీస్తారో!!