
మహేశ్‌బాబు తాజా సినిమా ‘భరత్ అనే నేను’ బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. రాజకీయ నేపథ్యంతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ మౌత్‌టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాను ఇటు ప్రేక్షకులే కాదు.. అటు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను ప్రశంసించారు. సామాజిక సందేశాన్ని కమర్షియల్ అంశాలతో జోడించి కొరటాల శివ ఈ సినిమాను చక్కగా తెరకెక్కించాడని, మహేశ్‌బాబు అద్భుతంగా నటించాడని ఎన్టీఆర్ కొనియాడారు. తాజాగా మెగా హీరో రాంచరణ్ కూడా ‘భరత్ అనే నేను’ సినిమాకు చక్కటి రివ్యూ ఇచ్చారు.
‘క్లాసిక్ సినిమా అని చెప్పడానికి ఒక పరిపూర్ణ ఉదాహరణ ఈ సినిమా. ఇందులో మహేశ్‌బాబు సటిల్‌గా కనిపిస్తూనే.. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కనబర్చారు. అందంగా రాసి.. అద్భుతంగా తెరకెక్కించారు శివగారు. దేవీ నువ్వు సూపర్.. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోరును బాగా ఎంజాయ్ చేశాను. అద్భుతమైన అరంగేట్రం చేసిన కియారాకు, మంచి చిత్రాన్ని అందించిన నిర్మాత డీవీవీ దానయ్యకు అభినందనలు’ అంటూ రాంచరణ్ తన అభిప్రాయాన్ని ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ఈ క్రమంలోనే మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తాజాగా కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment