
పండగ అంటే ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి పండగల్లా కాదండోయ్! అచ్చ తెలుగు పండగ... అందరూ కలసి చేసుకునే పండగ! చేతుల్లో సెల్లులు లేవ్. మనసుల్లో ముసుగులు లేవ్. మనుషులంతా మంచిగా చేసుకున్న ఆ పండగ ఎలా ఉందో... చూడాలంటే రామ్‌చరణ్ ‘రంగస్థలం’ విడుదల కావాల్సిందే.
రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఎర్నెనీ నవీన్, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘రంగస్థలం’. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో పండగ నేపథ్యంలో వచ్చే పాటను చిత్రీకరిస్తున్నారు. 1985వ సంవత్సరం నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది.
అప్పట్లో జాతరలు ఎలా జరిగేవో... ఇందులో చూడొచ్చన్న మాట! ఈ పాట చిత్రీకరణ పూర్తయ్యాక, వారం రోజుల విరామం తీసుకుని, మళ్లీ ఫ్రెష్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట! సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment