
‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) చిత్రంలోని పోరాట సన్నివేశా లను చూస్తున్నప్పుడు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతారని అంటున్నారు ఈ చిత్రరచయిత కె.వి.విజయేంద్రప్రసాద్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. ఈ చిత్రవిశేషాల గురించి ఇటీవల ఓ సందర్భంలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన సినిమా గురించి మనమే గొప్పగా చెప్పుకోవడం సభ్యత కాదు.
కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుంది. సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సీన్స్‌ను చూస్తున్నప్పుడు కొందరు ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ, గోల చేస్తూ సందడి చేస్తుంటారు. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూసినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చాయి. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో ఒక రకమైన బాధ దాగి ఉంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురవుతారనే నమ్మకం ఉంది. ఫస్ట్ టైమ్ ఫైట్ సీక్వెన్సెస్‌కి ఎమోషన్ అవుతారు ప్రేక్షకులు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment