రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘గేమ్‌చేంజర్’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే ఈ షెడ్యూల్‌లో చిన్న విరామం ఇచ్చిన యూనిట్ తిరిగి షూటింగ్‌ని ప్రారంభించినట్లు ఫిల్మ్‌నగర్ టాక్.
రామ్‌చరణ్‌తో పాటు కీలక తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట శంకర్. జయరాం, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment