రామ్‌చరణ్, అయాన్
...బుజ్జి అయాన్‌ని చిట్టిబాబు గెటప్‌లో చూసినవాళ్లు ఇలా అనకుండా ఉండలేకపోయారు. బుడతడు అచ్చంగా తన మామ రామ్‌చరణ్ గెటప్‌లో దిగిపోయాడు. ఫొటోలు చూశారుగా. చిన్న చిట్టిబాబు భలే ముద్దుగా ఉన్నాడు కదూ. ‘‘రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు! హార్డ్‌కోర్ చరణ్ మామ ఫ్యాన్. ‘రంగస్థలం’ సాంగ్స్‌ను ప్లే చేయమని ప్రతి రోజూ అయాన్ అల్లరి చేస్తున్నాడు. ఎంత సక్కగున్నావ్ బే’ అని చిట్టిబాబు గెటప్‌లో ఉన్న కొడుకు అయాన్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అల్లుఅర్జున్.
‘లైక్ మామ లైక్ అల్లుడు’ అన్నారు అల్లుఅర్జున్ వైఫ్ అల్లు స్నేహారెడ్డి. రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్, రామలక్ష్మి పాత్రలో సమంత, చిట్టిబాబు బ్రదర్ కె. కుమార్‌బాబు పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, సీనియర్ నరేష్, అనసూయ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఈ నెల 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment