‘రంగస్థలం’ బాటలో వరుణ్‌ | Varun Tej Film To Have Huge Sets | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 9 2018 7:36 AM | Last Updated on Mon, Apr 9 2018 7:36 AM

Varun Tej Film To Have Huge Sets - Sakshi

వరుణ్‌ తేజ్‌

సినీరంగంలో అడుగుపెట్టిన దగ్గరనుంచి ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలే చేస్తేన్న మెగా హీరో వరుణ్ తేజ్‌. ఇటీవల వరుసగా ఫిదా, తొలిప్రేమ లాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్లతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో త్వరలో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఘాజీ లాంటి డిఫరెంట్ సినిమాను తెరకెక్కించిన సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్‌.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ముందుగా యూరప్‌లో షూట్‌ చేయాలని భావించారు. అయితే రంగస్థలం రిలీజ్ తరువాత చిత్రయూనిట్ అభిప్రాయాన్ని మార్చుకున్నారట. పూర్తిగా సెట్‌ వేసి సెట్‌లోనే చిత్రీకరణ జరపాలని నిర్ణయించారని తెలుస్తోంది. రంగస్థలంలో కోసం 1980ల నాటి పల్లెను సృష్టించిన రామకృష్ణ, మౌనికలే వరుణ్ సినిమా కోసం సెట్‌ రెడీ చేస్తున్నారు.

స్పేష్ షెటిల్‌, శాటిలైట్‌, ఇస్రో వాతావరణాన్ని హైదరాబాద్‌లోనే సృష్టించనున్నారు. వరుణ్ తేజ్‌ సరసన అధితి రావు హైదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను దర‍్శకడు క్రిష్ నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో భారీ స్థాయిలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ను వినియోగించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement