సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమాగా తెరకెక్కుతున్న మహర్షి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు సూపర్ స్టార్.
రంగస్థలం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన సుక్కు, మహేష్ కోసం మరో వెరైటీ కథను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సుకుమార్ మహేష్ తో చేయబోయే సినిమా కూడా పిరియాడిక్ సినిమానే అన్న ప్రచారం జరుగుతోంది.
రంగస్థలంతో 1980ల కాలాన్ని పరిచయం చేస్తే మహేష్ సినిమా కోసం మరింత ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లనున్నారట. మహేష్, సుకుమార్‌ల సినిమా స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లో జరిగే కథగా తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment