రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత కూడా సుకుమార్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు చాలా టైం తీసుకుంటున్నాడు. రంగస్థలం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు సుకుమార్. కానీ కథా కథనాలపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో మహేష్ ఆ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేశాడు.
వెంటనే సుకుమార్.. అల్లు అర్జున్ హీరోగా సినిమాను ఎనౌన్స్ చేశాడు. అయితే ఆ ప్రాజెక్ట్ కూడా ఇప్పట్లో సెట్స్‌మీదకు వచ్చేలా కనిపించటం లేదు. ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్ సినిమా అంటుందన్న టాక్ వినిపించింది. కానీ తాజాగా బన్నీ పుట్టిన రోజు సందర్భంగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమాను ఎనౌన్స్ చేశారు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్ట్‌తో రెడీగా ఉంది. దీంతో సుకుమార్ సినిమా కన్నా ఐకాన్ నే ముందుగా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. దీంతో సుకుమార్‌కు మరికొంత కాలం వెయిటింగ్ తప్పేలా లేదు. మరి ఈ గ్యాప్‌లో సుక్కు వేరే హీరోతో సినిమా చేస్తాడా..?లేక బన్నీ డేట్స్‌కోసమే వెయిట్ చేస్తాడా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment