విడుదలై నెల రోజులైనా.. రంగస్థలం మేనియా ఇంకా తగ్గడం లేదు. రంగస్థలం కథ కొత్తది కాకపోయినా... నటీనటులు తమ నటనతో, సుకుమార్ తన టేకింగ్‌తో సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టారు. ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్‌కు రప్పించేలా చేశారు ఈ లెక్కల మాష్టారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లకే కాక... ప్రతీ ఆర్టిస్ట్‌కు మంచి పేరు వచ్చింది. అనసూయ, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్, ఆది పినిశెట్టి... ఇలా ఎవరి పాత్రకు వారు ప్రాణం పోశారు. ఇదంతా ఓకే. కెమెరా ముందు నటించడం మనకు తెలిసిన విషయమే. కెమెరా ముందు ఎంత బాగా నటించినా... డబ్బింగ్ సరిగా లేకపోతే...అది తేలిపోతుంది. అందుకే సినిమాకు డబ్బింగ్ ప్రాణం.
డబ్బింగ్ చెప్పేటప్పుడు... మళ్లీ ఆ పాత్రలోకి, సన్నివేశంలోకి పరకాయ ప్రవేశం చేసి అదే ఫీలింగ్‌ను క్యారీ చేస్తూ... సీన్‌ను రక్తికట్టించాల్సి ఉంటుంది. రంగస్థలంలో ఆది చనిపోయే సీన్‌లో తన నటన ఆమోఘం. ఆ సన్నివేశానికి ఆది డబ్బింగ్ చెబుతున్న వీడియోను ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తను డబ్బింగ్ చెబుతున్న తీరు అందర్ని విస్మయపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన రంగస్థలం ఇప్పటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment