
రంగస్థలం టీంకు బహుమతులిస్తున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకు రచయితలుగా పనిచేసిన బుచ్చిబాబు, కాశీ, శ్రీనివాస్‌లకు చరణ్ గిఫ్ట్స్ ఇచ్చాడు. సినిమా అవుట్‌పుట్ విషయంలో చాలా ఆనందంగా ఉన్న చరణ్ తన ఆనందాన్ని యూనిట్ సభ్యులతో పంచుకుంటున్నాడు. ఈ రోజు (మంగళవారం) తన పుట్టిన రోజు కూడా కావటంతో యూనిట్ సభ్యులకు చరణ్ గిఫ్ట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన రంగస్థలం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.