
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా రంగస్థలం. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్‌లోనూ రికార్డ్ కలెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప‍్తంగా వందకోట్ల గ్రాస్‌ను సాధించి సత్తా చాటింది. చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 1980ల కాలంలో జరిగే కథ తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్.. చిట్టిబాబు గా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు.
రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్‌గా నటించగా ఆది పినిశెట్టి, జగపతి బాబు, అనసూయ, ప్రకాష్ రాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తున్న రంగస్థలం ముందు ముందు మరిన్ని రికార్డ్ లు తిరగరాయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.