
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా నటులుగా రామ్‌చరణ్, సమంతలకు ఎంత పేరు తీసుకువచ్చిందో.. సహాయ పాత్రలో నటించిన అనసూయ కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. బుల్లితెర మీద ట్రెండీగా కనిపించే అనసూయ రంగస్థలంలో పల్లెటూరి మహిళగా కనిపించటంతో అభిమానులు ఫిదా అయ్యారు.
అయితే తనదైన నటనతో రంగమ్మత్త పాత్రకు ప్రాణం పోసింది అనసూయ. అందుకే రంగస్థలం సినిమా చూసిన ప్రముఖులు రామ్ చరణ్, సమంతలతో పాటు అనసూయ పాత్రను కూడా ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. తాజాగా అనసూయను ఈ సినిమా కోసం ఆడిషన్ చేసిన సందర్భంలోని వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రంగస్థలం ఇప్పటికే 180 కోట్లకు పైగా గ్రాస్ సాధించి 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment