రంగస్థలంపై రాజమౌళి స్పందన | Rajamouli About Rangasthalam | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 7 2018 10:14 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Rajamouli About Rangasthalam - Sakshi

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా రంగస్థలం. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు దర్శకులు రంగస్థలం సినిమా చూసి స్పందించారు.

అయితే ప్రతీ సినిమాను తొలిరోజే చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించే రాజమౌళి మాత్రం కాస్త ఆలస్యంగా స్పందించారు. శనివారం ఉదయం రంగస్థలం టీంను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు రాజమౌళి. ‘రంగస్థలంలో గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. కానీ చిట్టిబాబు పాత్రను సుకుమార్‌ మలిచిన విధానం, ఆ పాత్రలో చరణ్ నటన అన్నింటిని మరుగున పడేలా చేశాయి. చిట్టిబాబు పాత్రలోని ప్రతీ చిన్న ఎక్స్‌ప్రెషన్‌ కన్నుల పండుగగా ఉంది. నెమ్మదిగా సంభాషణలు పలుకుతూ నటించిన జగపతి బాబు అద‍్భుతం. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ ఇతర యూనిట్‌ సభ్యులకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి.

బాహుబలి సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ల కాంబినేషన్‌లో తెరకెక్కబోయే మల్టీ స్టారర్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్‌ నుంచి సెట్స్‌మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement