Rangasthalam First 'Review' | రంగస్థలం తొలి రివ్యూ: టాక్‌ ఏంటీ? - Sakshi
Sakshi News home page

రంగస్థలం తొలి రివ్యూ: టాక్‌ ఏంటీ?

Published Thu, Mar 29 2018 6:50 PM | Last Updated on Thu, Mar 29 2018 8:54 PM

Rangasthalam First Review By Umair Sandhu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘రంగస్థలం’. ఈ నెల 30న (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈచిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.  దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎంతసక్కగున్నావే, రంగమ్మ మంగమ్మ పాటలు శ్రోతలను విపరీతంగా అలరించేశాయి. ఇటీవలే సెన్సార్‌ పూర్తిచేసుకున్న ఈచిత్రానికి సెన్సార్‌ బృందం సైతం సినిమా బాగుందని కితాబు ఇచ్చిందంట.

అయితే విడుదలకు సిద్ధంగా ఉన్న రంగస్థలంపై తొలి రివ్యూ వచ్చేసింది. యూఏఈకి చెందిన సినీ విమర్శకుడు ఉమర్ సంధూ ‘రంగస్థలం’పై తన రివ్యూను ప్రకటించారు. ఫుల్‌ పైసా వసూల్ మసాలా ఫ్లిక్‌గా అభివర్ణించారు. రామ్ చరణ్, సమంత, జగపతి బాబు అద్భుతంగా నటించారంటూ ఆకాశానికి ఎత్తేశారు. అద్భుతమైన కథతో సుకుమార్‌ తెరకెక్కించాడని, దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ రాకింగ్‌గా ఉందంటూ కితాబిచ్చారు. అంతటితో ఆగకుండా సినిమాకు రేటింగ్ కూడా ఇచ్చేశారు. 

అయితే ఈ రివ్యూపై టాలీవుడ్‌ అభిమానుల్లో ఒకింత ఆందోళన మొదలైంది. ఎందుకుంటే ఉమర్‌ సంధూ గతంలో కాటమరాయుడు, స్పైడర్, అజ్ఞాతవాసి సినిమాలకు టాప్‌ రేటింగ్‌ ఇచ్చాడు. ఈచిత్రాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డాయి. దీంతో సినిమా ఎలా ఉందబోతోందో అని టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. కానీ మెగా అభిమానులు మాత్రం సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సంధూ రివ్యూతో రంగస్థలాన్ని ముడిపెట్టి చూడలేమంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement