
రంగస్థలం సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలో టైటిల్ లోగోలో 1985 అనే పదం హైలెట్ అయ్యింది. కానీ కొంతకాలం తర్వాత 1985ను తొలగించి.. కేవలం రంగస్థలం అని ప్రచారం చేశారు. ప్రస్తుతం రంగస్థలం ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న రామ్ చరణ్ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
‘టైటిల్‌లో 1985 అని ఫిక్స్ చేయడం వల్ల సమస్యలు తలెత్తే ఛాన్సు ఉంది. ఎందుకంటే ప్రతీ ఐదేళ్లకొకసారి జనరేషన్‌లో ట్రెండ్.. ఫ్యాషన్ మారుతుంటాయి. అలా ఒక సంవత్సరానికి పరిమితం చేస్తే.. అందరూ దాన్ని దృష్టిలో పెట్టుకునే చూస్తారు. అలాంటప్పుడు తప్పులను ఎత్తిచూపే అవకాశం కూడా ఉంది. అందుకే ఏ గొడవా లేకుండా దాన్ని తీసేసి 80 నేపథ్యంలో జరిగే కథ అని పిరియాడికల్ డ్రామాగా రంగస్థలాన్ని ప్రకటించాం’ అని చెర్రీ చెప్పుకొచ్చాడు. ఇక మొదటగా చెర్రీకి.. సుకుమార్ కథేంటో కూడా చెప్పలేదంట . కేవలం చెవిటివాడిగా నటించాలనీ కోరాడని.. అందుకు ఒప్పుకుంటేనే కథ చెబుతానని తేల్చేశాడంట మన లెక్కల మాష్టార్. అయితే సుక్కూ మీద నమ్మకంతో అలా కథేంటో కూడా వినకుండా ఓకే చెప్పానని చెర్రీ తెలిపాడు.
ఇక రంగస్థలం మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ విలేజ్ పొలిటికల్ డ్రామాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.