
Where Is Vijayendra Prasad?: రామ్‌చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా తెరకెక్కుతున్న సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కోసం ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. మార్చి 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా జక్కన్న ప్రమోషన్స్ చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అయితే ఈ ప్రమోషన్స్‌లో అందరూ కనిపిస్తున్నారు కానీ ఈ సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
ఆర్‌ఆర్‌ఆర్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో కూడా ఆయన ఎక్కడా కనిపించలేదు. దీంతో విజయేంద్ర ప్రసాద్ ఎక్కడా అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవలె ఆయన కరోనా బారిన పడినట్లు తెలుస్తుంది. ఆరోగ్య సమస్యలు, వయస్సు రీత్యా ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నట్లు సమాచారం. కాగా రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాహుబలి1అండ్ 2, మణికర్ణిక సహా పలు సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి కూడా స్వయంగా ఆయనే కథ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment