
ఇండస్ట్రీ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. రామ్‌చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా నటించిన ఈ సినిమా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రమోషన్స్‌ను ఓ రేంజ్‌లో నిర్వహిస్తుంది. ఇటీవలె ఆర్‌ఆర్‌ఆర్ యూనిట్‌తో అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి ముగ్గురు కలిసి ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఈ క్రమంలో తారక్, చరణ్, జక్కన్న చేసిన సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ ఇంటర్వ్యూ మాదిరిగా కాకుండా చాలా సరదాగా, ఫన్నీగా సాగింది ఈ ఇంటర్వ్యూ. ఎవరెవరు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అన్న దగ్గరి నుంచి ఏఏ ప్రాంతాలకు వెళ్లి ప్రమోషన్స్ చేయాలన్న వివరాలను ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడుకున్నారు.
వీడియో మొదట్లో 'నాకు నిద్రొస్తుంది కాపీ పెడతాను. మీకు ఏమైనా కావాలా' అని చరణ్ అడగ్గా.. 'నువ్వు పెడితే విషం కూడా తాగుతా' అంటూ తారక్ బదులిచ్చాడు. దీంతో రాజమౌళి ఎంటర్ అయ్యి.. అయితే రెండు చుక్కల విషం కలిపి ఇచ్చెయ్ అంటూ కౌంటర్ వేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment