సినీ ప్రియులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి కూపీ లాగే ప్రయత్నం చేశాడు సత్తి.
ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. 1920లో మాట్లాడే తెలంగాణ భాషను సినిమాలో వాడామని చెప్పాడు. హీరోలిద్దరి పారితోషికం కన్నా సెట్లకు వేసిన ఖర్చు, విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఎక్కువ ఖర్చు చేశామన్నాడు రాజమౌళి. ఇన్నేళ్లలో సినిమా పూర్తి చేస్తామనే విషయంలో అందరిముందే అబద్ధాలు ఆడతానన్నాడు డైరెక్టర్. మరి వీళ్లు ఇంకా ఏమేం మాట్లాడారో తెలియాలంటే కింది ఇంటర్వ్యూ చూసేయండి..
Comments
Please login to add a commentAdd a comment