చెఫ్‌గా మారిన చరణ్‌ | Ram Charan Became Master Chef For Upasana | Sakshi
Sakshi News home page

Published Wed, Apr 18 2018 11:35 AM | Last Updated on Wed, Apr 18 2018 1:51 PM

Ram Charan Became Master Chef For Upasana - Sakshi

వంట చేస్తున్న రామ్‌ చరణ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ రంగస్థలం సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తూనే తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు చరణ్‌. అందుకోసం బాలీవుడ్‌ ఫిజికల్‌ ట్రయినర్‌ పర్యవేక్షణలో భారీగా కసరత్తులు చేస్తున్నాడు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు అభిమానుల కోసం తన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు చరణ్‌ భార్య ఉపాసన.

తాజాగా మరో ఆసక్తికర ట్వీట్‌తో అభిమానులను ఖుషీ చేశారు ఉపాసన. ‘మాస్టర్‌ చెఫ్‌, ‘మిస్టర్‌ సి’ వర్క్‌ అవుట్స్‌ తరువాత మా ఇద్దరి కోసం బ్రేక్‌ఫాస్ట్‌ను సిద్ధం చేస్తున్నారు’ అనే కామెంట్‌ తో పాటు చరణ్‌ వంట చేస్తున్నఫొటోలను ట్వీట్‌ చేశారు. రంగస్థలం సినిమాలో మాస్‌ లుక్‌ లో కనిపించిన చరణ్.. బోయపాటి సినిమాతో స్టైలిష్ గా అలరించేందుకు రెడీ అవుతున్నాడు ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తుండగా భరత్‌ అనే నేను ఫేం కియారా అద్వానీ చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement