
దర్శకుడు సుకుమార్, హీరో ప్రభాస్
రామ్ చరణ్ హీరోగా రంగస్థలం చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని ఓ స్టార్ హీరోతో చేయనున్నట్టుగా తెలిపారు. రంగస్థలం ఘనవిజయం సాధించటంతో ప్రేక్షకులు సినీ వర్గాలు సుకుమార్‌ను రంగస్థల బ్రహ్మగా కీర్తిస‍్తున్నారు. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్న సుక్కు, తన తదుపరి చిత్రాన్ని కూడా ఓ స్టార్ హీరోతో చేయాలని భావిస్తున్నారు. రంగస్థలం ప్రచార కార్యక్రమాల్లో తనకు ప్రభాస్ హీరోగా సినిమా తెరకెక్కించాలనుందన్న కోరికను బయట పెట్టారు.
దీంతో సుకుమార్ తదుపరి చిత్రం ప్రభాస్‌తోనే ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సాహో తరువాత జిల్ ఫేం రాధాకృష‍్ణ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించారు. ఒకవేళ ప్రభాస్, సుకుమార్‌తో సినిమా అంగీకరిస్తే సాహో పూర్తయిన వెంటనే ప్రారంభిస్తారా..? లేక రాధకృష్ణ సినిమా కూడా పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తారో చూడాలి.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment