సుకుమార్‌తో సూపర్‌ స్టార్‌ | Sukumar to Direct 26th Movie Of Mahesh Babu | Sakshi
Sakshi News home page

Published Sun, Apr 22 2018 1:08 PM | Last Updated on Thu, May 10 2018 12:13 PM

Sukumar to Direct 26th Movie Of Mahesh Babu - Sakshi

భరత్‌ అనే నేను సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్న సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మరో సినిమాను కన్ఫామ్ చేశాడు. త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్న మహేష్ ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. సుకుమార్‌ దర్శకత్వంలో తన 26వ సినిమా చేసేందుకు అంగీకరించాడు మహేష్‌.

గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన వన్‌ నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా టెక్నికల్‌గా ఆకట్టుకోవటంతో మరోసారి సుకుమార్‌తో కలిసి పనిచేసేందుకు ఓకె చెప్పాడు మహేష్. ఇటీవల సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రంగస్థలం సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మహేష్‌, సుకుమార్‌ ల కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను నిర్మించనుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement