దేవీ.. ఎందుకిలా చేశావ్‌? | Devi Sri Prasad Disappoints with Aa Gattunutava Song | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 31 2018 7:39 PM | Last Updated on Sat, Mar 31 2018 8:04 PM

Devi Sri Prasad Disappoints with Aa Gattunutava Song  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అనూహ్యమైన స్పందనతో రంగస్థలం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. సెకండాఫ్‌లో కాస్త సాగదీత సన్నివేశాలు ఉన్నప్పటికీ.. చెర్రీ నటన, విలేజ్‌ సెట్టింగ్‌తో సుక్కూ చేసిన మాయ వర్కవుట్‌ అయ్యింది. దీనికి దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు కూర్చిన పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. అయితే సినిమాలోని ఓ పాట గురించి ఇప్పుడు చర్చ మొదలైంది. 

ఈ చిత్రంలో ‘ఆ గట్టునుంటావా నాగన్న?’ పాట ఆడియో ఆల్బమ్‌లో ఇన్‌స్టాంట్‌ హిట్‌గా నిలిచింది. పొలిటికల్‌ నేపథ్యంలో సాగే ఆ పాట సినిమాలో హైలెట్‌ కావటమని అంతా అనుకున్నారు. అయితే థియేటర్లకు వెళ్లిన వారికి ఆ సాంగ్‌తో దేవీ షాకిచ్చాడు. ఆడియోలో ఈ పాటను దేవి పాడిన వర్షన్‌ ఉంది. (రంగస్థలం రివ్యూ)

నిజానికి ఒరిజినల్‌ వర్షన్‌ పాడింది జానపద గేయకారుడు శివ నాగులు. ఆడియోలో ఆ పాట అంత హిట్‌ కావటానికి కూడా ఆయన గాత్రమే కారణం. కానీ, సినిమాలో నాగులు వాయిస్‌ బదులు దేవీ గొంతు వినిపించటంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సోషల్‌మీడియాలో దేవీని నిలదీస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement