![Sukumar And Mahesh Babu Movie Updates - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/10/Mahesh%20Babu%20Sukumar.jpg.webp?itok=IC7PAKry)
భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను ప్రారంభించనున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన వన్ నేనొక్కడినే ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అయితే రంగస్థలం సినిమా ఘనవిజయం సాధించటంతో సుకుమార్‌కు మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్.
రంగస్థలం తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సుకుమార్.. మహేష్ బాబు హీరోగా తెరకెక్కించబోయే సినిమా పనులు ప్రారంభించాడు. ఇప్పటికే దేవీ శ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసిన చిత్రయూనిట్ ఇతర సాంకేతిక నిపుణులను నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
Comments
Please login to add a commentAdd a comment