మెగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ | Rangasthalam Jigel Rani Promo Song Released | Sakshi
Sakshi News home page

మెగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌

Published Tue, Mar 27 2018 6:59 PM | Last Updated on Tue, Mar 27 2018 7:19 PM

Ram Charan - Sakshi

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మెగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చాడు. తన పుట్టిన రోజు సందర్భంగా జిగేల్‌ రాణి  ప్రోమో సాంగ్‌ను రిలీజ్‌ చేశాడు. మాస్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్‌. ఈ పేటకు నేనే మేస్త్రీ..., ఆట కావాలా...పాట కావాలా... ఇలా మాస్‌కు హుషారు ఎక్కించిన పాటలు ఎన్నో ఉన్నాయి. ఈ పాటలలో చిరు లుంగీ కట్టుకుని వేసిన స్టెప్స్‌ ఎప్పటికీ అభిమానుల​ గుండెల్లో గుర్తుండిపోయేవే. అయితే చిరు తనయుడు చరణ్‌ గత సినిమాల్లో లుంగీ కట్టుకుని మాస్‌ను మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ​, చిరు స్థాయిని మాత్రం అందుకోలేకపోయాడు.

తాజాగా రంగస్థలం సినిమాలో చెర్రీ దాదాపుగా లుంగీలోనే దర్శనమివ్వబోతున్నాడు. అయితే సుకుమార్‌ సినిమాలో ఐటం సాంగ్స్‌కు ఉండే ప్రత్యేకతే వేరు. సుక్కు మేకింగ్‌, దేవీ మ్యూజిక్‌, విజువైలేజేషన్‌ ఐటం సాంగ్‌ను ఓ లెవల్‌కు తీసుకెళ్తాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో వీడియో సాంగ్స్‌ ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తున్నా...అభిమానులు మాత్రం జిగేల్‌ రాణి ప్రోమో కోసమే ఎదురుచూశారు. చెర్రీ బర్త్‌డే సందర్భంగా...ఈ సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. వీడియోలో చెర్రీ స్టెప్పులు, ఎనర్జీ చూస్తే అభిమానులు విజిల్స్‌ వేయాల్సిందే. థియేటర్‌లో ఈ సాంగ్‌కు బాక్స్‌ బద్దలు అవుతాయేమో.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement