చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు 3 వేల పేజీలతో సుదీర్ఘమైన చార్జ్‌షీట్‌ను తయారు చేశారు. ఈ హత్య కేసులో కన్నడ ప్రముఖ హీరో దర్శన్, నటి పవిత్రగౌడ, మరో 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు రప్పించడం, హత్య చేయడం, శవాన్ని డ్రైనేజీలో పారవేయడంతో సహా అన్ని అంశాలను సవివరంగా పొందుపరిచినట్లు తెలిసింది.
పెద్దసంఖ్యలో సాక్షుల, నిందితుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేశారు. కొందరిని జడ్జీల ముందు హారుపరిచి స్టేట్మెంట్ ఇప్పించారు. ముందు ప్రథమ ముద్దాయిగా పవిత్రగౌడను పోలీసులు పేర్కొన్నప్పటికీ, తరువాత దర్శన్ ప్రమేయం ఎక్కువని తేలడంతో ఆయననే ఏ1 నిందితుడిగా తేల్చారు. త్వరలో కోర్టులో చార్జిషీటును సమర్పించే అవకాశం ఉంది. ఆ తరువాత దర్శన్, ఇతర నిందితులకు బెయిలుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. సుమారు గత మూడు నెలలుగా దర్శన్ జైలులోనే ఉన్నారు.
ఇప్పటికే బెయిల్ కోసం ఆయన పలుమార్లు అప్పీలు చేసుకున్నా కోర్టు ఇవ్వలేదు. ఇప్పటి వరకు విచారణ మాత్రమే జరుగుతుందని కోర్టు తెలిపింది. పోలీసులు చార్జ్‌షీట్ వేసిన తర్వాత దానిని పరిశీలించి బెయిల్ ఇచ్చే అంశం గురించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. అయితే, తాజాగా పోలీసులు 3 వేల పేజీలతో చార్జ్ షీట్ రెడీ చేశారు. దీంతో దర్శన్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
పవిత్ర బెయిలు అర్జీ వాయిదా
పవిత్రగౌడ పెట్టుకున్న బెయిలు అర్జీని కోర్టు 27వ తేదీకి వాయిదా వేసింది. ఆమెకు బెయిలు ఇవ్వరాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. జూన్ 10న అరెస్టైన పవిత్రగౌడ అప్పటి నుంచి పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment