కన్నడ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత అయిన ద్వారకీష్ (81) గుండెపోటు కారణంగా ఏప్రిల్ 16న మరణించారు. 1963లో నటుడిగా చిత్ర సీమలో అడుగుపెట్టిన ఆయన సుమారు 150కి పైగా సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా 50కి పైగా చిత్రాలను నిర్మించారు. పరమానందయ్య శిష్యుల కథ ,రామాయణంలో పిడకల వేట వంటి తెలుగు సినిమాలను నిర్మాతగా కన్నడలో రీమేక్ చేశారు. తమిళ్, తెలుగులో హిట్ అయిన బిచ్చగాడు సినిమాను కూడా కన్నడలో ఆయనే రీమేక్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో కిషోర్ కుమార్‌ని కూడా కన్నడ చిత్ర సీమకు పరిచయం చేసింది ద్వారకీష్ కావడం విశేషం. నిర్మాతగా ఎంతో మంది కొత్తవాళ్లను సినిమాల్లోకి తీసుకొచ్చారు. నటులు, నటీమణులకే కాదు-కొత్త దర్శకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు కూడా అవకాశాలు ఇచ్చారు. అందరూ ఆయనను తమ "గాడ్ ఫాదర్"గా కన్నడ సీమలో భావిస్తారు.
కన్నడ సినిమాకు వరుసగా రెండు దశాబ్దాలుగా భారీ హిట్లు అందించిన నిర్మాతగా ఆయనకు గుర్తింపు ఉంది. కన్నడ సినిమా పరిశ్రమకు అందించిన సేవలకు గాను ఎన్టీఆర్ అవార్డు ద్వారకీష్‌ను వరించింది. సీనియర్ ఎన్టీఆర్ పరమానందయ్య శిష్యుల కథ చిత్రం వల్ల వారిద్దిర మధ్య మంచి ఔనత్యం ఉండేది. ద్వారకీష్ గుండెపోటుతో మరణించడం వల్ల కన్నడ చిత్ర సీమలో విషాదం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment