Anekal Balraj: Kannada Film Producer Dies Of Road Accident - Sakshi
Sakshi News home page

Producer Anekal Balraj Death News: వాకింగ్‌కు వెళ్లిన.. సినీ నిర్మాత దుర్మరణం

Published Mon, May 16 2022 7:57 AM | Last Updated on Mon, May 16 2022 10:55 AM

Kannada Film Producer Anekal Balraj Dies Of Road Accident - Sakshi

బనశంకరి(బెంగళూరు): కన్నడ కరియ, గణప లాంటి సినిమాలు నిర్మించిన నిర్మాత అనేకల్‌ బాలరాజ్‌ (58) రోడ్డు ప్రమాదంలో  మృతిచెందారు. బెంగళూరు జేపీ నగరలో నివాసం వద్ద  ఆదివారం ఉదయం బాలరాజ్‌ వాకింగ్‌ చేసేందుకు బాల్‌రాజ్‌ తన కారును రోడ్డు పక్కన ఆపి దాటబోతున్నారు. అంతలో ఆయనను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలరాజ్‌ తలకి తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా, ఉదయం 10 గంటలకు మృతి చెందాడు. 2003లో దర్శన్ కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన చిత్రం ‘కరియా’తో సహా ఆరు కన్నడ చిత్రాలను నిర్మించారు. ఆయన తన కొడుకు సంతోష్ బాల్‌రాజ్‌ని 2009లో విడుదల చేసిన తన చిత్రం ‘కెంప’లో ప్రధాన నటుడిగా పరిచయం చేశాడు. 

చదవండి: KGF 3: 'కేజీఎఫ్‌ 3'పై నెలకొన్న సందిగ్ధత.. మరో నిర్మాత స్పందన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement