మలయాళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ మారిన హేమ కమిటీ రిపోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మాలివుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ నుంచి పలు సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ఓ నివేదిక రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు హీరోయిన్లు, ఇతర నటులు గతంలో తమ చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా మలయాళ తొలి ట్రాన్స్‌జెండర్ నటి అంజలి అమీర్ తన అనుభవాలను పంచుకున్నారు.
మలయాళ నటుడు నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ వల్ల తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అంజలి అమీర్ ఇలా పంచుకున్నారు. ' 2018లో మమ్ముట్టి నటించిన పెరున్బు అనే తమిళ సినిమాలో నేను కీలక పాత్ర పోషించాను. ఆ సినిమాలో సూరజ్ వెంజరమూడ్ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఆయన నుంచి నాకు ఒక ప్రశ్న ఎదురైంది. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులు స్త్రీలలాగా ఎలా సుఖం పొందుతారని సూరజ్ వెంజరమూడ్ నన్ను ప్రశ్నంచారు. అప్పుడు నేను చాలా కలత చెందాను.
ఆయన అడిగేంత వరకు, నేను అలాంటి బాధాకరమైన అనుభవాలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. నేను బలంగా ఉన్నాను, కానీ ఈ ప్రశ్న నాకు చాలా కోపం తెప్పించింది. అతడిని హెచ్చరించి మమ్ముట్టికి, దర్శకుడికి తెలియజేశాను. ఆపై వెంటనే సూరజ్ వెంజరమూడ్ క్షమాపణలు చెప్పాడు. మరలా నాతో అలా మాట్లాడలేదు. నేను ఆయన్ను అభినందిస్తున్నాను.' అని అంజలి అమీర్ అన్నారు. సూరజ్ వెంజరమూడ్ టాలీవుడ్‌కు పరిచయమే.. డ్రైవింగ్ లైసెన్స్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, జనగణమన చిత్రాలతో పాటు నాగేంద్రన్స్ హానీమూన్స్ వెబ్ సిరీస్‌తో ఆయన తెలుగు వారికి దగ్గరయ్యాడు.
ఇండస్ట్రీలో చాలా మంది నటులు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారని అంజలి పేర్కొంది. అన్ని విభాగాల్లో మాదిరి ఇక్కడ కూడా మంచివాళ్లతో పాటు చెడువాళ్లు కూడా ఉన్నారు. ఇక్కడ కొందరు మాత్రమే కాంప్రమైజ్‌లు, ఫేవర్‌లు అడిగేవాళ్లు ఉన్నారని అంజలి పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment