కన్నడ హీరో శ్రీ మురళి నటించిన తాజా చిత్రం బఘీర. దీపావళీ కానుకగా అక్టోబర్ 31న ఈ చిత్రం విడుదలైంది. అయితే, మొదటిసారి ఏ కన్నడ సినిమాకు దక్కిన క్రేజ్ ఈ చిత్రానికి దక్కిందని తెలుస్తుంది. డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు కథ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
'బఘీర' కథను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించడంతో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రీచ్ అయింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కూడా డిజిటల్ రైట్స్ తీసుకునేందుకు ఆసక్తి కనపరిచిందని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇంతవరకు ఏ కన్నడ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీ రైట్స్‌ను దక్కించుకోలేదు. అక్కడ పెద్దగా మార్కెట్ లేకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ ఆసక్తి కనపరచలేదని సమాచారం. అయితే, ఇప్పుడు బఘీర హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు కన్నడ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.
కన్నడ ఇండస్ట్రీకి చెందిన కాంతార సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర భాషలకు సంబంధించిన వర్షన్స్ అమెజాన్ ప్రైమ్‌లో రన్ అవుతున్నాయి. కన్నడ సినిమాలు ఒకప్పుడు ఇతర భాషలలో విడుదల కాకపోవడంతో ఓటీటీ సంస్థలు పెద్దగా ఆ ఇండస్ట్రీపై ఆసక్తి చూపలేదు. అయితే, కేజీఎఫ్ తర్వాత వారి సినిమాల మార్కెట్ పెరిగింది. దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో కన్నడ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అందుకే బఘీర సినిమా డిజిటల్ రైట్స్ తొలిసారి నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని కన్నడలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment